News April 6, 2025

అందరూ రామాయణం, భారతం చదవాలి: వెంకయ్య

image

AP: శ్రీరాముడు అసమానతలు లేని ఆదర్శ పాలన చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని పాలన చేయాలని నాయకులకు సూచించారు. నెల్లూరు(D) చౌటపాళెంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మాట్లాడుతూ ‘ప్రతిఒక్కరూ రామాయణం, మహాభారతం చదవాలి. అలా చేయకపోవడం వల్లే అశాంతి నెలకొంది. చిన్నపిల్లలు కూడా హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 17, 2025

అందంగా ఉంటేనే అవకాశాలు రావు: తమన్నా

image

అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయనడం తనకు నచ్చదని హీరోయిన్ తమన్నా అన్నారు. అందంపై శ్రద్ధ ఉండాలి కానీ, అదే సినిమా ఛాన్సులు తీసుకువస్తుందంటే తాను నమ్మనని చెప్పారు. ‘‘మిల్కీ బ్యూటీ’ ట్యాగ్ నాకు ఫ్యాన్స్ ఇచ్చారు. దీనిని మీడియా మరింత ప్రచారం చేసింది. ఈ ట్యాగ్ వల్ల నా సినిమాల ఛాయిస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా తమన్నా నటించిన ‘ఓదెల 2’ ఇవాళ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

News April 17, 2025

భూ భారతిలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు: మంత్రి

image

TG: భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణపేట(D) మద్దూరులో భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ధరణిలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. భూ భారతిలో రూపాయి కూడా చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం పేదల భూములను కొల్లగొట్టింది. ఆడిట్ చేసి ఆ భూములను అర్హులైన పేదలకు ఇస్తాం’ అని పేర్కొన్నారు.

News April 17, 2025

WEF జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

image

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జాబితాలో చోటు సంపాదించుకున్నారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన 116మందికి యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF చోటు కల్పించింది. భారత్ నుంచి మెుత్తంగా ఏడుగురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 40 సంవత్సరాలలోపు వ్యక్తులను యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF గుర్తిస్తుంది.

error: Content is protected !!