News April 6, 2025
స్టార్ హీరోయిన్‌పై నిర్మాత కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌పై స్త్రీ-2 మూవీ నిర్మాత దినేశ్ విజాన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. శ్రద్ధా నవ్వితే అచ్చం దెయ్యంలా ఉంటుందని, అందుకే స్త్రీ మూవీలో ఎంపిక చేసినట్లు దినేశ్ చెప్పారని ఆ సినిమా డైరెక్టర్ అమర్ కౌశిక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో శ్రద్ధా ఫ్యాన్స్ దినేశ్‌పై మండిపడుతున్నారు. ఆమె పేరుతో డబ్బులు సంపాదించుకుని ఇలా అవమానించడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News April 17, 2025
అందంగా ఉంటేనే అవకాశాలు రావు: తమన్నా

అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయనడం తనకు నచ్చదని హీరోయిన్ తమన్నా అన్నారు. అందంపై శ్రద్ధ ఉండాలి కానీ, అదే సినిమా ఛాన్సులు తీసుకువస్తుందంటే తాను నమ్మనని చెప్పారు. ‘‘మిల్కీ బ్యూటీ’ ట్యాగ్ నాకు ఫ్యాన్స్ ఇచ్చారు. దీనిని మీడియా మరింత ప్రచారం చేసింది. ఈ ట్యాగ్ వల్ల నా సినిమాల ఛాయిస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా తమన్నా నటించిన ‘ఓదెల 2’ ఇవాళ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
News April 17, 2025
భూ భారతిలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు: మంత్రి

TG: భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణపేట(D) మద్దూరులో భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ధరణిలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. భూ భారతిలో రూపాయి కూడా చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం పేదల భూములను కొల్లగొట్టింది. ఆడిట్ చేసి ఆ భూములను అర్హులైన పేదలకు ఇస్తాం’ అని పేర్కొన్నారు.
News April 17, 2025
WEF జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జాబితాలో చోటు సంపాదించుకున్నారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన 116మందికి యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF చోటు కల్పించింది. భారత్ నుంచి మెుత్తంగా ఏడుగురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 40 సంవత్సరాలలోపు వ్యక్తులను యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF గుర్తిస్తుంది.