News April 6, 2025
అంబేద్కర్ కోనసీమ: సోమవారం యథావిధిగా గ్రీవెన్స్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక- గ్రీవెన్స్ కార్యక్రమం ఈ నెల 7న సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో జరుగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారించుకోవాలని ఆయన సూచించారు. డివిజన్, మండల, మునిసిపల్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
Similar News
News April 17, 2025
లాఠీచార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: MLC కవిత

భీంగల్‌లో BRS పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జికి పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డీజీపీని డిమాండ్ చేశారు. అలాగే BRS కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని ఆమె X లో డిమాండ్ చేశారు. లాఠీచార్జీలకు, కాంగ్రెస్ కార్యకర్తల దాడులకు భయపడేదే లేదన్నారు.
News April 17, 2025
రాజవొమ్మంగి: ఏకలవ్య ఫలితాలు విడుదల

ఏకలవ్య విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ ఫలితాలు విడుదలయ్యాయని ప్రిన్సిపల్ కృష్ణారావు గురువారం తెలిపారు. రాజవొమ్మంగి, అడ్డతీగల, మారేడుమిల్లి, వై. రామవరం మండలాల్లో ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. రాజవొమ్మంగి లో 6th క్లాస్ లో 60 సీట్లుకి 360 మంది పరీక్షలు రాశారని తెలిపారు. “website: twreiscet.apcfss.in/twreisIndex” https://www.schools360.in/ap-emrs-cet-results/ లో ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
News April 17, 2025
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్

ఆండ్రాయిడ్ డివైజ్‌లు డేటా చోరీకి గురి కాకుండా ఉండేందుకు IOS ఇనాక్టివిటీ రీబూట్ ఫంక్షన్ తరహాలో కొత్త ఫీచర్ రానుంది. 3 రోజులపాటు ఫోన్ లాక్ అయి ఉండడం లేదా ఉపయోగించకుండా ఉంటే ఫోన్ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయి హై సెక్యూరిటీ మోడ్‌లోకి వెళ్తుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు డిసేబుల్ అవుతాయి. ఫోన్ మళ్లీ వాడాలంటే పాస్ కోడ్ ఎంటర్ చేయాలి. గూగుల్ ప్లే సర్వీసెస్ వెర్షన్ 25.14తో ఈ ఫీచర్ రానుంది.