News March 26, 2024
VZM: ఈవీఎంల భద్రతను సమీక్షించిన కలెక్టర్

స్థానిక ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములను తెరిపించి, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన గదులను, ఈవీఎంలను పరిశీలించారు. అనంతరం మళ్లీ గోదాములకు సీల్ వేయించారు. గోదాములలోని సీసీ కెమేరాలను తనిఖీ చేశారు. ఈవీఎంల తొలిదశ తనిఖీకి ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
Similar News
News March 27, 2026
VZM: ఆర్కే బీచ్‌లో అలలకు కొట్టుకెళ్లారు..ఆ తర్వాత?

ఆర్కే బీచ్‌లోని కాళీమాత టెంపుల్ ఎదురుగా సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ పోలిరాజు, దేవుడు, సురేష్ కాపాడారని మెరైన్ సీఐ రమేష్ తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయిన వారు విజయనగరానికి చెందిన జగదీష్, ఒడిశాకు చెందిన సుమత్ అమత్‌లుగా గుర్తించారు. వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

రామతీర్థం సీతారాముల కల్యాణానికి హాజరైన ఎస్పీ

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామతీర్థంలో నేడు నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఎస్పీ దామోదర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించి ఆలయానికి చేరుకున్నారు. వీరికి అర్చకులు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించారు.