News April 6, 2025
విదేశీ పర్యటనకు బయలుదేరిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. పోర్చుగల్, స్లోవేకియా దేశాల అధ్యక్షుల ఆహ్వనం మేరకు రాష్ట్రపతి ఆ దేశాలకు వెళ్లనున్నారు. 7,8న పోర్చుగల్‌లో 9,10 తేదీలలో స్లోవేకియాలో ఆమె పర్యటించనున్నారు. ఈ దేశాలలో భారత రాష్ట్రపతి పర్యటించడం దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
Similar News
News April 17, 2025
రోజూ ఆకుకూరలు తింటే ఇన్ని లాభాలా?

రోజూ ఆకుకూరలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ‘పాలకూరతో గుండెపోటు రిస్కు తగ్గుతుంది. కొత్తిమీర కొలస్ట్రాల్ లెవెల్స్‌ను 10-15% తగ్గిస్తుంది. మెంతిలో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించి బ్రెస్ట్ & ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్కును తప్పిస్తుంది. గోంగూర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నిరోధిస్తుంది’ అని తెలిపారు.
News April 17, 2025
అందంగా ఉంటేనే అవకాశాలు రావు: తమన్నా

అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయనడం తనకు నచ్చదని హీరోయిన్ తమన్నా అన్నారు. అందంపై శ్రద్ధ ఉండాలి కానీ, అదే సినిమా ఛాన్సులు తీసుకువస్తుందంటే తాను నమ్మనని చెప్పారు. ‘‘మిల్కీ బ్యూటీ’ ట్యాగ్ నాకు ఫ్యాన్స్ ఇచ్చారు. దీనిని మీడియా మరింత ప్రచారం చేసింది. ఈ ట్యాగ్ వల్ల నా సినిమాల ఛాయిస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా తమన్నా నటించిన ‘ఓదెల 2’ ఇవాళ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
News April 17, 2025
భూ భారతిలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు: మంత్రి

TG: భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణపేట(D) మద్దూరులో భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ధరణిలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. భూ భారతిలో రూపాయి కూడా చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం పేదల భూములను కొల్లగొట్టింది. ఆడిట్ చేసి ఆ భూములను అర్హులైన పేదలకు ఇస్తాం’ అని పేర్కొన్నారు.