News April 6, 2025

కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల వారి సమస్యలపై వినతులు స్వీకరిస్తామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి సమస్యల పరిష్కారాలకు చేస్తామన్నారు.

Similar News

News April 17, 2025

మంత్రి పొన్నం అపాయింట్‌మెంట్ కావాలా!

image

మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయనను కాలవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘మంత్రి అపాయింట్‌ మెంట్ కావాలంటే 9959226407 నంబర్‌కు మెసేజ్ చేయాలని’ ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన మంచి ఫలితాలను ఇస్తుందని మంత్రి కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.

News April 17, 2025

మన అనంతగిరి THE BEST

image

వారంలో ఒక్కరోజైనా రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే, అనంతగిరి హిల్స్ బెస్ట్ ప్లేస్. వీకెండ్ వచ్చిందంటే చాలు HYD, కర్ణాటక నుంచి వందలాది మంది టూరిస్టులు ఇక్కడికి క్యూ కడతారు. చుట్టూ పచ్చని కొండలు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మూసీ నది పుట్టుక ఈ అడవుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ టూర్ వెళ్లాలంటే వరుసగా లీవ్‌లు పెట్టే అవసరం లేదు. ఒక్కరోజులోనే అనంతగిరిని చుట్టిరావొచ్చు.
SHARE IT

News April 17, 2025

భారీగా పెరిగిన బంగారం ధర

image

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.89,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 పెరిగి రూ.97,310 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,10,100గా ఉంది. అతి త్వరలోనే తులం బంగారం రూ.లక్షకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

error: Content is protected !!