News April 6, 2025

జైపూర్: ఇందారం ఓసీలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె

image

శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓపెన్ కాస్ట్ గనిలో వేతనాలు పెంచాలని ఓబీ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేపట్టారు. ఆదివారం సమ్మె శిబిరాన్ని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రొజ్ ఖాన్, బ్రాంచ్ అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్ సందర్శించి మద్దతు తెలిపారు. వెంటనే కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 17, 2025

రాజవొమ్మంగి: ఏకలవ్య ఫలితాలు విడుదల

image

ఏకలవ్య విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ ఫలితాలు విడుదలయ్యాయని ప్రిన్సిపల్ కృష్ణారావు గురువారం తెలిపారు. రాజవొమ్మంగి, అడ్డతీగల, మారేడుమిల్లి, వై. రామవరం మండలాల్లో ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. రాజవొమ్మంగి లో 6th క్లాస్ లో 60 సీట్లుకి 360 మంది పరీక్షలు రాశారని తెలిపారు. “website: twreiscet.apcfss.in/twreisIndex” https://www.schools360.in/ap-emrs-cet-results/ లో ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

News April 17, 2025

ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్

image

ఆండ్రాయిడ్ డివైజ్‌లు డేటా చోరీకి గురి కాకుండా ఉండేందుకు IOS ఇనాక్టివిటీ రీబూట్ ఫంక్షన్ తరహాలో కొత్త ఫీచర్ రానుంది. 3 రోజులపాటు ఫోన్ లాక్ అయి ఉండడం లేదా ఉపయోగించకుండా ఉంటే ఫోన్ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయి హై సెక్యూరిటీ మోడ్‌లోకి వెళ్తుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు డిసేబుల్ అవుతాయి. ఫోన్ మళ్లీ వాడాలంటే పాస్ కోడ్ ఎంటర్ చేయాలి. గూగుల్ ప్లే సర్వీసెస్ వెర్షన్ 25.14తో ఈ ఫీచర్ రానుంది.

News April 17, 2025

మంత్రి పొన్నం అపాయింట్‌మెంట్ కావాలా!

image

మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయనను కాలవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘మంత్రి అపాయింట్‌ మెంట్ కావాలంటే 9959226407 నంబర్‌కు మెసేజ్ చేయాలని’ ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన మంచి ఫలితాలను ఇస్తుందని మంత్రి కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.

error: Content is protected !!