News April 6, 2025
దేవీపట్నం: ‘మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యనే హత్య చేశాడు’

దేవీపట్నం(M) పాముగండికి చెందిన కె.గంగన్నదొర మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని అతని భార్య పాపయమ్మ (28) హత్య చేసాడని ఎస్సై షరీఫ్ ఆదివారం తెలిపారు. తాగుడుకు అలవాటు పడిన గంగన్న దొర నిత్యం డబ్బులు కోసం ఆమెను వేధించేవాడని పేర్కొన్నారు. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని ఆమెను కర్రతో తీవ్రంగా కొట్టి, గొంతు నొక్కి చంపాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News April 17, 2025
పార్టీలో చిత్తూరు ఎంపీకి మరో పదవి

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావుకు పార్టీలో మరో కీలక పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీని నియమించారు. ఈ కమిటీలో చిత్తూరు ఎంపీని మెంబర్‌గా అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు ఎంపీ దగ్గుమళ్ల ధన్యవాదములు తెలిపారు.
News April 17, 2025
కాకినాడ: జిల్లాకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ

కాకినాడ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉందని బుధవారం రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. జిల్లాలోని కాకినాడ రూరల్, పెద్దాపురం, తుని, సామర్లకోట, పిఠాపురం ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజల చరవాణులకు ఈ మేరకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జిల్లాలో అనేక సార్లు నిజమయ్యాయి. ప్రజలు, రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News April 17, 2025
లాఠీచార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: MLC కవిత

భీంగల్‌లో BRS పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జికి పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డీజీపీని డిమాండ్ చేశారు. అలాగే BRS కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని ఆమె X లో డిమాండ్ చేశారు. లాఠీచార్జీలకు, కాంగ్రెస్ కార్యకర్తల దాడులకు భయపడేదే లేదన్నారు.