News April 6, 2025

పర్చూరు: శ్రీరామ పట్టాభిషేకానికి 1818 నాటి రాగి నాణెం

image

బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులోని పురాతన కోదండరామ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదిపూడి గ్రామానికి చెందిన కాల్వ రఘు రామయ్య శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించి 1818లో ముద్రించిన రాగి నాణేలను ప్రదర్శించారు. ఆనాటి నాణేన్ని చూడడానికి ఆసక్తిగా గ్రామ ప్రజలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఆలయంలో సందడినెలకొంది.

Similar News

News April 17, 2025

మెదక్: ఈ నెల 20 నుంచి ఓపెన్ పరీక్షలు: డీఈఓ

image

ఈ నెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్‌కు 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

News April 17, 2025

SRPT: ఆశగా చూస్తున్నాం సారూ.. ఎప్పుడు ఇస్తారు..?

image

రేషన్‌ కార్డులు లేని నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలకు ఈ కార్డునే ప్రమాణికంగా తీసుకోవడంతో కార్డులేని వారు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. జిల్లాలో 3,24,158 కార్డులు ఉండగా.. కొత్తగా 1,03,798 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఎంపిక చేసిన గ్రామాల్లో 2,350 మందికి కార్డులు పంపిణీ చేశారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో కార్డులు లేనివారు తమకెప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్నారు.

News April 17, 2025

నష్టాలతో మొదలై.. భారీ లాభాల్లో మార్కెట్లు

image

ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటి క్రితం 1074 పాయింట్ల లాభంతో 78,126 వద్ద ట్రేడ్ అవుతోంది. Nifty 300 పాయింట్ల లాభంతో 23,737 వద్ద ట్రేడ్ అవుతోంది. భారతీ ఎయిర్‌టెల్, ఐసీసీఐ బ్యాంక్, గ్రాసిం ఇండస్ట్రీస్, సన్ ఫార్మా లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. విప్రో, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, L&T, HCL టెక్నాలజీస్ నష్టాల్లో ఉన్నాయి.

error: Content is protected !!