News April 6, 2025

సన్న బియ్యం దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు?: మహేశ్ గౌడ్

image

తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వానివేనని BJP నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ‘BJP దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్రమంత్రి బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి, సొంత పార్టీలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల కోసం కొందరు HCUపై మాట్లాడటం సరికాదు. మేం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా’ అని ప్రశ్నించారు.

Similar News

News April 17, 2025

సరిలేరు నీకెవ్వరు.. చిన్నారుల ఆపరేషన్‌కు మహేశ్‌ సాయం

image

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు హీరో మహేశ్‌బాబు ఉచితంగా ఆపరేషన్స్ చేయిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు పిల్లలకు శస్త్రచికిత్స చేయించినట్లు ‘MB ఫౌండేషన్’ ట్వీట్ చేసింది. వరలక్ష్మి (2 నెలలు), పండూరి ఇముగ్ధ శ్రీ (5 నెలలు), పూజ్యశ్రీ ఫనీక్ష (8 నెలలు)లకు హార్ట్ ఆపరేషన్లు చేసి కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా, ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 4500+ సర్జరీలు జరగడం విశేషం.

News April 17, 2025

సిట్ విచారణకు విజయసాయి గైర్హాజరు

image

AP: మద్యం కుంభకోణం కేసులో ఇవాళ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని సిట్‌కు సమాచారం ఇచ్చారు. ఎప్పుడు విచారణకు హాజరయ్యేది త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.

News April 17, 2025

వరుసగా మూడ్రోజులు సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు రేపు సెలవు ఉండనుంది. గుడ్‌ఫ్రైడేని పురస్కరించుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రేపు జనరల్ హాలిడేగా ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులూ పనిచేయవు. పలు కేంద్ర సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు శనివారమూ సెలవు ఉండటంతో ఆదివారంతో కలిపి మొత్తం 3 రోజులు సెలవులు రానున్నాయి. మీకూ వరుస సెలవులు వచ్చాయా? కామెంట్ చేయండి.

error: Content is protected !!