News April 6, 2025
తిరుపతి: రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

తిరుపతి శ్రీవేంకటేశ్వర అగ్రికల్చర్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికగా మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌కు సోమవారం ఉదయం 11 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. MBBS పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు angrau.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
Similar News
News April 17, 2025
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి బాధ్యతలు

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న అరుణ సారెక చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖపట్నం వ్యాట్ కోర్టు అప్పలెట్ జడ్జిగా ఉన్న గోపి నియమితులయ్యారు. నేడు ఆయన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.
News April 17, 2025
పోలవరం: మట్టి నాణ్యతను పరిశీలిస్తున్న కేంద్ర నిపుణులు

పోలవరం ప్రాజెక్టు పరిధిలో మట్టి నాణ్యత పరీక్షలు గురువారం కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర నిపుణుల బృందం దండంగి, పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానికంగా లేబరేటరీలో పరీక్షతోపాటు మరింత సూక్ష్మంగా తమ కేంద్ర కార్యాలయంలో మట్టిని పరిరక్షిస్తామని అధికారులు తెలిపారు.
News April 17, 2025
ఆ 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట

పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగాలు కోల్పోయిన 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు కాస్త ఉపశమనం కలిగించింది. నూతన నియామకాలు చేపట్టేవరకు వారు విధులు నిర్వహించవచ్చని తెలిపింది. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో 25వేల టీచర్ నియామకాలు చెల్లవని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.