News April 6, 2025

పశ్చిమ బెంగాల్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం

image

పశ్చిమ బెంగాల్ సిలిగుడిలో మత సామరస్యం వెల్లివిరిసింది. శ్రీరామ నవమి శోభాయాత్ర చేస్తున్న భక్తులను ముస్లిం యూత్ పూలు చల్లుతూ ఆహ్వానించారు. ర్యాలీలో పాల్గొన్న వారికి వాటర్ బాటిల్స్ అందజేశారు. భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సిలిగుడిలో అన్ని మతాల వారు సోదర భావంతో నివసిస్తారని, మత వివక్ష ఉండదని భక్తులు తెలిపారు.

Similar News

News April 17, 2025

ఆ 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట

image

పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగాలు కోల్పోయిన 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు కాస్త ఉపశమనం కలిగించింది. నూతన నియామకాలు చేపట్టేవరకు వారు విధులు నిర్వహించవచ్చని తెలిపింది. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో 25వేల టీచర్ నియామకాలు చెల్లవని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

News April 17, 2025

అమానుషం.. బధిర బాలికపై సామూహిక అత్యాచారం?

image

UPలో 2 రోజుల క్రితం అదృశ్యమైన ఓ 11 ఏళ్ల మూగ-చెవిటి బాలిక అర్ధనగ్నంగా, అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె ముఖంపై గాయాలు, పంటిగాట్లు, మర్మాంగాలపై సిగరెట్‌తో కాల్చిన గుర్తులున్నట్లు వైద్యులు తెలిపారు. సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు SP అతుల్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.

News April 17, 2025

YCP హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు: కూటమి నేతలు

image

AP: ఎస్వీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేతలు ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కూటమి నేతలు విమర్శించారు. తాము గోశాల వద్దకు వచ్చామని, భూమనతో సహా ఇతర వైసీపీ నేతలెవరూ ఇక్కడికి రాలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

error: Content is protected !!