News April 6, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ☞ హజ్ యాత్ర అనేది ముస్లింలకు ఓ కల: మంత్రి ఫరూక్ ☞ రాములోరి కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి బీసీ ☞ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్సీ భూమిరెడ్డి ☞ నందిపాడులో ప్రమాదం.. యువకుడి మృతి ☞ బీసీ రాజారెడ్డిని కలిసిన సింగర్ కరీముల్లా ☞ కురుకుందలో గాలివాన బీభత్సం ☞ రేపు కలెక్టరేట్లో PGRS: కలెక్టర్ రాజకుమారి
Similar News
News February 28, 2026
ధర్మపురి బ్రహ్మోత్సవాలకు పూర్తి సహకారం: కలెక్టర్

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా పరిపాలన యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. జిల్లాలో ధర్మపురి క్షేత్రం ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం కలిగి ఉందన్నారు. బ్రహ్మోత్సవాలు శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణంలో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. భక్తులు సంయమనం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని అనంతరం అన్నప్రసాదం స్వీకరించాలని, వాలంటీర్లు,ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు.
News February 28, 2026
గృహనిర్మాణ శాఖ అధికారులతో సత్యసాయి కలెక్టర్ సమీక్ష

సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉగాది నాటికి పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. నిర్మాణ పనులు చేపట్టడంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 28, 2026
AP కొత్త CSగా.. ప్రకాశం జిల్లా వాసి.!

AP చీఫ్ సెక్రెటరీగా <<19261711>>సాయిప్రసాద్<<>> నేడు బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన ఆయన 1991 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. తన సర్వీసులో కీలక పోస్టులలో పని చేశారు. 2024 జూన్ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శిగా.. 2025 జనవరి నుంచి CM ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 2019-24 మధ్య ఏపీ సోలార్ కార్పొరేషన్ CMDగా కూడా పనిచేశారు.


