News April 7, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు➤ నంచర్ల-గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్➤ ఎమ్మిగనూరు: ప్రమాదంలో ఒకరు మృతి➤శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హై కోర్టు జడ్జ్ ➤రామ నామాలతో శ్రీరాముడి చిత్రం➤ పారతో చెత్త తొలగించిన ఆదోని ఎమ్మెల్యే➤ శ్రీ మఠంలో మూల బృందావనానికి పూజలు➤ కోడుమూరు: యువకుడిపై పోక్సో కేసు➤ పెద్దకడబూరు: ఎల్ఎల్సీ కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం
Similar News
News April 17, 2025
కర్నూలు: సీనియర్ సిటిజన్ ఐడీకి ఆన్‌లైన్ దరఖాస్తులు

జిల్లా వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి రయిస్ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలు సీనియర్ సిటిజన్లు అర్హులన్నారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, పాసుపోర్టు సైజు ఫొటోతో వార్డు, గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News April 17, 2025
కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

కోడుమూరు మండలం వర్కూరు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెల్తుర్ధి మండలం శ్రీరంగపురానికి చెందిన వెంకటరాముడి మృతి చెందాడు. ఇరు బైక్‌ల మీద ఉన్న అరవింద్, వేణులు, బదినేహాల్ వాసులు షాషావలి, దాదపీరాలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 17, 2025
వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా?

వేసవి సెలవుల్లో పిల్లలను విహార యాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలో ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అవి.. శ్రీశైలం, మహానంది, అహోబిలం, మంత్రాలయం, యాగంటి, ఎల్లార్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్, సంగమేశ్వర ఆలయం, సన్ టెంపుల్, ఓంకారం క్షేత్రం.