News April 7, 2025

స్వగ్రామంలో వెంకయ్య నాయుడు పూజలు

image

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్వగ్రామమైన వెంకటాచలం మండలం చౌటపాలెంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తన మనువడు విష్ణుబాబుతో కలిసి సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. సమాజంలో కనిపిస్తున్న వివక్షలు, అసహనం వంటి సామాజిక రుగ్మతలకు శ్రీరాముడి ఆదర్శాలే సరైన పరిష్కారమని వెంకయ్య నాయుడు సూచించారు.

Similar News

News April 17, 2025

నెల్లూరు: నిమ్మకు తెగుళ్ల బెడద..!

image

నెల్లూరు జిల్లాలో 10వేల హెక్టార్లలో నిమ్మపంట సాగవుతోంది. వివిధ రకాల తెగుళ్లు ఆశించడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తోటలు పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఈపంటపై ఆకు ముడత, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు, బంక, వేరుకుళ్లు, గజ్జి, మొజాయిక్‌ తెగుళ్లు ఆశించాయి. వీటి నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని పొదలకూరు ఉద్యాన అధికారి ఆనంద్ సూచించారు.

News April 17, 2025

నూతన జిల్లా జడ్జిను కలిసిన కలెక్టర్ ఆనంద్ 

image

నూతన నెల్లూరు జిల్లా జడ్జిగా శ్రీనివాసును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం కలెక్టర్ ఓ.ఆనంద్ జాయింట్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి స్వాగం పలికారు. అనంతరం జిల్లాల్లోని పలు అంశాలపై చర్చించారు. వీరి వెంట జిల్లా అధికారులు ఉన్నారు. 

News April 17, 2025

30న నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం

image

నెల్లూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు సీఈవో విద్యారమ ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. ప్రధానంగా 2024-2025 సంవత్సరానికి సంబంధించి జిల్లా, మండల పరిషత్ సవరణ బడ్జెట్, 2025-2026 అంచనా బడ్జెట్‌పై సమీక్షిస్తామన్నారు.

error: Content is protected !!