News March 26, 2024
నెల్లూరు జాతి ఆవు వరల్డ్ రికార్డ్

బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు రికార్డు సృష్టించింది. వయాటినా-19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవీస్ అనే ఆవు రూ.40 కోట్లకు అమ్ముడై ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అత్యంత నాణ్యమైన జన్యులక్షణాలు గల నెల్లూరు జాతి ఆవును సొంతం చేసుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం ఈ జాతి ఆవుల ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.
Similar News
News March 20, 2026
వెయిట్ లాస్ మందుల ధర తగ్గించిన నాట్కో

అధిక బరువుతో బాధపడేవారికి NATCO గుడ్ న్యూస్ చెప్పింది. నోవో నార్డిస్క్ పేటెంట్ గడువు ముగియడంతో సెమాగ్లుటైడ్ జెనరిక్ వెర్షన్‌ను అత్యంత చౌకగా మార్కెట్లోకి తెచ్చింది. SEMANATTM, SEMAFULLTM బ్రాండ్ల పేరుతో లభించే మల్టీ-డోస్ వయల్స్ ధరను కేవలం ₹1,290గా నిర్ణయించింది. ఇది అసలు బ్రాండ్ ధర కంటే దాదాపు 90% తక్కువ కావడం విశేషం. ఏప్రిల్‌లో పెన్ డివైజ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
News March 20, 2026
ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు

TG: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని(EHS) ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రైవేటు హాస్పిటల్స్‌లో 1,998 వ్యాధులకు చికిత్స పొందవచ్చని తెలిపారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తామన్నారు.
News March 20, 2026
ఒక్క రోజే రూ.5,000 తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఓ వైపు <<19430821>>బంగారం<<>> ధరలు పెరగ్గా వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్‌పై రూ.5వేలు తగ్గి రూ.2,60,000 పలుకుతోంది. నిన్న కూడా కేజీపై రూ.10,000 తగ్గిన విషయం తెలిసిందే. మొత్తంగా 3 రోజుల్లో కేజీపై రూ.20,000 తగ్గడం గమనార్హం.


