News April 7, 2025

నందికొట్కూరు: టేకు ఆకుపై సీతారాముల కళ్యాణ చిత్రం

image

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు వినూత్నంగా టేకు ఆకుపై సీతారాముల కళ్యాణం చిత్రం గీశారు. ఆయన మాట్లాడుతూ.. అంతా రామమయం, జగమంతా రామమయం, ఈ లోకంలోని సమస్త జనులకు రామాయణ మహాకావ్యం ఆదర్శవంతమైనదని తెలిపారు. సీతారామ చంద్రుల ఆశీస్సులు ప్రజలందరిపై కురిపించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News January 12, 2026

జనగామ: ‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి’

image

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫొటో ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన అంశాలపై రివ్యూ నిర్వహించారు.

News January 12, 2026

ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 16 ఫిర్యాదులు

image

తూ.గో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 16 ఆర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ ప్రజల నుంచి స్వయంగా ఆర్జీలు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.

News January 12, 2026

చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు

image

AP: జగన్‌ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో ₹3.32L కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు ఏడాదిన్నరలోనే ₹3.02L కోట్లు అప్పు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైసీపీ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్‌ అవుతుందా? జగన్‌ చేసిన అప్పుల్లో 90% CBN ఏడాదిన్నరలోనే చేశారు. ఎన్నికల హామీలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు’ అని అంబటి ఫైరయ్యారు.