News April 7, 2025

SRD: పది మూల్యాంకనానికి ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

image

రామచంద్రపురం మండలంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో రేపటి నిర్వహించే పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. 1222 మంది ఉపాధ్యాయులను నియమించామని, మూల్యాంకన కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Similar News

News November 5, 2025

‘ఏటిమొగ-ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం’

image

ఏటిమొగ-ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని డీసీఎం పవన్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఇతర అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఏటిమొగ-ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయన్న పవన్.. అలైన్‌మెంట్‌లో మార్పుల కారణంగా మరో రూ.60 కోట్ల వ్యయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారన్నారు.

News November 5, 2025

GET READY: మరికాసేపట్లో..

image

మరికొన్ని నిమిషాల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా సా.6.49 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా వచ్చి కనువిందు చేయనున్నాడు. సాధారణ రోజులతో పోలిస్తే భూమికి దగ్గరగా చంద్రుడు రావడంతో 14% పెద్దగా, 30% అధిక కాంతితో దర్శనమిస్తాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి.

News November 5, 2025

బాపట్లలో కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

బాపట్ల పట్టణంలోని మరుప్రోలు వారి పాలెం గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై బుధవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.