News April 7, 2025
ధర్మవరంలో రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్

ధర్మవరం ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో ఈనెల 6 నుంచి 9 వరకు 15వ ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ హాకీ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 22 టీంలు, 440 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News April 17, 2025
పెద్దపల్లి: రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

పెద్దపల్లి సమీపంలోని అండుగులపల్లి ఫోర్ లైన్ రాజీవ్ రహదారిపై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోర్ లైన్ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నందున ట్రాఫిక్‌ను వన్ వే వైపు మళ్లించారు. ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 17, 2025
చిన్నారుల భవిష్యత్తుకు అండగా ఉంటాం: సచిన్

చిన్నారుల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు సచిన్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ చేతులు కలిపాయి. మేఘాలయ ప్రభుత్వ భాగస్వామ్యంతో రెండు సంస్థలు పనిచేయనున్నాయి. ఈ మేరకు క్రికెట్ దిగ్గజం సచిన్ ట్వీట్ చేశారు. మూలాలపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన మార్పు వస్తుందన్న విషయం మేఘాలయా పర్యటనతో అర్థమైందన్నారు. పిల్లల ఆత్మస్థైర్యం, లోకల్ టీమ్స్ నిబద్ధత ఈ ప్రయాణంలో తమకు స్ఫూర్తినిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
News April 17, 2025
సారంగాపూర్: ఉరేసుకొని వృద్ధుడు మృతి

ఉరేసుకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన సారంగాపూర్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వంజర గ్రామానికి చెందిన పోశెట్టి (65) 20 ఏళ్లుగా హనుమాన్ దేవాలయంలో ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.