News April 7, 2025

అనకాపల్లి జిల్లాలో మరో ఐదు రోజులు వర్షాలు

image

ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో జిల్లాలో మరో ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Similar News

News December 27, 2025

నేషనల్ వాటర్ పోలో పోటీలకు సంగారెడ్డి విద్యార్థి

image

జాతీయస్థాయి వాటర్ పోలో పోటీలకు సంగారెడ్డికి చెందిన మహమ్మద్ రెహమాన్ ఎంపికయ్యారు. ఈ నెల 27 నుండి 29 వరకు హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్, వాటర్ పోలో పోటీలలో ఆయన పాల్గొంటారని రాష్ట్ర కార్యదర్శి ఉమేష్ శుక్రవారం తెలిపారు. రెహమాన్ జాతీయస్థాయిలోనూ రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు.

ఒంగోలులో జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్

image

ఒంగోలులోని సెయింట్ జెవియర్ స్కూల్ లో శనివారం జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ పీడీ దాసరి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కెరియర్ పట్ల అవగాహన కలిగించడం, అలాగే వృత్తి విద్యపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. దీనితో విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించడం జరుగుతుందని, విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు.