News April 7, 2025
HYD: MMTS రైళ్లలో మహిళల రక్షణ కోసం వాట్సప్ గ్రూప్

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణకు ఆర్పీఎఫ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ రైలులో ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మహిళా కోచ్‌లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
Similar News
News January 16, 2026
మీరు పాలించడానికి అర్హులేనా?: జగన్

AP: గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో YSRCP కార్యకర్త మందా సాల్మన్ హత్యకు TDP వర్గీయులే కారణమని మాజీ CM జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ‘రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు? మీరు పాలించడానికి అర్హులేనా?’ అంటూ CM చంద్రబాబును ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపడం దుర్మార్గమని మండిపడ్డారు.
News January 16, 2026
స్పీకర్‌కు ఇదే చివరి అవకాశం: సుప్రీంకోర్టు

TG: BRS MLAల పార్టీ ఫిరాయింపు కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్‌కు ఇదే చివరి అవకాశమని వ్యాఖ్యానించింది. ‘ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు ఉంటాయి. మిగిలిన ముగ్గురు MLAలపై నిర్ణయం తీసుకోండి’ అని ఆదేశించింది. ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు స్పీకర్ 4 వారాల టైమ్ కోరగా 2 వారాల్లో ప్రగతి చూపిస్తే 4 వారాల సమయం ఇస్తామని SC తెలిపింది.
News January 16, 2026
BREAKING: నల్గొండలో మర్డర్

నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్షణ చోటు చేసుకొని రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లికి చెందిన చంద్రుగా గుర్తించారు. రైల్వే పనుల నిమిత్తం నల్గొండకు వచ్చిన సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. 2వ టౌన్ ఎస్‌ఐ ఎర్ర సైదులు దర్యాప్తు ప్రారంభించారు.


