News April 7, 2025

కొత్తగూడెం జిల్లాలో నేడు ప్రజావాణి రద్దు

image

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పట్టాభిషేక కార్యక్రమంలో ఉండటం వల్ల ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు ఎవరు కూడా తమ సమస్యలపై ప్రజావాణికి రావొద్దని సూచించారు.

Similar News

News April 22, 2025

కొమురం భీం జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా రెబ్బెన మండలంలో 43.8 ఉష్ణోగ్రత ఉండగా ఆసిఫాబాద్, సిర్పూర్‌టి 43.7, పెంచికల్పేట్ 43.6, కౌటాల 43.5, కెరామేరి, బెజ్జూరు 43.4, తీర్యాని 43.3, దహేగాం, కాగజ్నగర్ 43.2, చింతలమానపల్లి 42.6, జైనూరు 42.1, లింగాపూర్ 40.1గా నమోదైంది.

News April 22, 2025

విజయవాడ: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య 

image

విజయవాడలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి వీరేంద్ర అనే వ్యక్తి అంబాపురంలో నివాసం ఉంటున్నాడు.17వ తేదీన భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. అయితే సోమవారం సాయి నరేంద్ర ఇంట్లో తలుపులు వేసుకొని ఉరి వేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలం చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

News April 22, 2025

హనుమకొండ: తేలనున్న 39,980 మంది విద్యార్థుల భవితవ్యం!

image

హనుమకొండ జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 39,980 మంది విద్యార్థులు ఉన్నారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 18,397 మంది, ఒకేషనల్ 1,146, ద్వితీయ సంవత్సరం జనరల్-19,480, ఒకేషనల్-957 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు. #SHARE IT

error: Content is protected !!