News April 7, 2025

కోడేరు: మురుగు కాలువలో పడి యువకుడు మృతి

image

మూర్చ వ్యాధితో యువకుడు ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి మృతి చెందిన ఘటన కోడేరులో ఆదివారం ఉదయం చోటుచేసుకంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కోడేరు క చెందిన మిద్దె మహేష్ (20) అనే యువకుడు గత కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళుతుండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి ప్రధాన రహదారి పక్కల ఉన్న మురుగు కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News October 30, 2025

VJA: ఆలయాల నష్టంపై కమిషనర్ సమీక్ష

image

‘మొంథా’ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని దేవాదాయ సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కమిషనర్ కె. రామచంద్ర మోహన్ బుధారం ఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలయ భవనాలు, ఆస్తుల నష్టం వివరాలు సేకరించి, తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిసరాల శుభ్రత, శానిటేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

News October 30, 2025

బీ అలెర్ట్.. కృష్ణా నదికి 6 లక్షల క్యూసెక్కుల వరద.!

image

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణా నది మరోసారి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇవాళ ప్రకాశం బ్యారేజ్‌కి 6 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బ్యారేజ్ వద్ద 2.68 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 2 గంటల్లో 3.97 లక్షలకు వరద చేరుకుంటుందని దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనునట్లు అధికారులు తెలిపారు.

News October 30, 2025

కామారెడ్డి: నవంబర్ 4న యువజన వారోత్సవాలు

image

జిల్లాలోని కళాభారతి వేదికగా నవంబర్ 4న యువజన వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కళాకారుల బృంద సభ్యులు గురువారం తెలిపారు. పాటలు, వ్యాసరచన, డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలో పాల్గొనదలిచిన యువత వయస్సు 15 నుంచి 29 ఏళ్ల వయస్సు, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 2వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.