News April 7, 2025

జనగామ: మూడెకరాల్లో పంట సాగు.. ఎకరానికే రైతు రైతుబంధు?

image

మూడెకరాల్లో పంట సాగు చేసినప్పటికీ తమకు రైతు రైతుబంధు అందలేదంటూ రైతులు గ్రామపంచాయతీ ముందు నిరసన చేపట్టిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడం గ్రామంలో చోటు చేసుకుంది. 3 ఎకరాల్లో పంట సాగు చేస్తే ఎకరానికే రైతుబంధు అందిందని, ఏఈవోలు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టలేదని రైతులు ఆరోపించారు. గ్రామంలో 72 మందికి రావాల్సి ఉందని, ఇప్పటికైనా రైతుబంధు అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.

Similar News

News January 18, 2026

VJA: పెళ్లి సంబంధం ఇష్టంలేదని కాలువలో దూకేశాడు..!

image

పేరెంట్స్ చూసిన పెళ్లి సంబంధం నచ్చలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు కాలువలోకి దూకిన ఘటన కలకలం రేపింది. పటమట దర్శిపేటకు చెందిన యువకుడికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఈ నెల 16న పెళ్లి చూపులకు వెళ్లారు. అయితే ఆ సంబంధం ఇష్టం లేని యువకుడు.. శనివారం సాయంత్రం యనమలకుదురు పాత వంతెన వద్ద తన ఫోన్ పక్కన పడేసి కాలువలోకి దూకాడు. సమాచారం అందుకున్న NDRF బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంకా ఆచూకీ తెలియలేదు.

News January 18, 2026

నేటి నుంచి నాగోబా జాతర

image

TG: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్(D) కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా ఇవాళ 10pmకు మహాపూజలతో అంకురార్పణ చేయనున్నారు. మెస్రం వంశీయులు మంచిర్యాల(D)లోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభం అవుతుంది. 22న గిరిజన దర్బార్, 25వ తేదీతో జాతర ముగియనుంది.

News January 18, 2026

చిత్తూరు జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రూ.15 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది కంటే ఇది 34% ఎక్కువ. సాధారణంగా జిల్లాలో రోజుకు రూ.కోటి వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. న్యూ ఇయర్ పురస్కరించుకొని రికార్డు స్థాయిలో రూ.14 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే. పండుగల వేళ భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.