News April 7, 2025

వరంగల్: ప్రతిభ కనబరిచిన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు

image

ఏవీవీ కళాశాలలో జరిగిన తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అఫీషియల్ అటెంప్ట్‌లో వరంగల్ నగరానికి చెందిన మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ కోచ్ మణికంఠ గడదాసుతో పాటు పలువురు అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. నేడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ విచ్చేసి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు.

Similar News

News November 6, 2025

విశాఖలో ప్రశాంతంగా ముగిసిన కార్తీక పౌర్ణమి వేడుకలు

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్‌ల వద్ద వేలాదిమంది భక్తులు సముద్ర స్నానం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీఐజీ గోపినాథ్‌ ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజల సహకారంతో పాటు రెవెన్యూ, మత్స్య, వైద్య, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.

News November 6, 2025

పున్నమి వెలుగుల్లో వేములవాడ రాజన్న ఆలయం..!

image

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం పున్నమి వెలుగుల్లో కాంతులీనుతోంది. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా పున్నమి చంద్రుడు మరింత ప్రకాశవంతం కావడంతో ఆ వెలుగులు రాజన్న ఆలయంపై ప్రసరించి ఆలయ ప్రాంగణం మరింత ద్విగుణీకృతంగా కనిపిస్తోంది. పట్టణానికి చెందిన సీనియర్ ఫొటోగ్రాఫర్ రాజయ్య కెమెరాకు చిక్కిన ఈ చిత్రం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. SHARE IT

News November 6, 2025

కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రారంభించిన సిరిసిల్ల కలెక్టర్

image

కార్తీక పౌర్ణమి వేడుకల సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో లక్ష దీపాలతో సామూహిక దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొని భక్తులకు బహుమతులను అందజేశారు.