News March 26, 2024
జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.
Similar News
News September 8, 2025
మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి: DEO బిక్షపతి

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏడో తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. దరఖాస్తులను http://bsc.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించి సమర్పించాలని కోరారు.
News September 8, 2025
NLG: సీసీటీవీ ఇన్స్టాలేషన్, సర్వీస్‌లో ఉచిత శిక్షణ

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు CCTV ఇన్స్టాలేషన్, సర్వీస్‌లో 13 రోజుల ఉచిత శిక్షణ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి సోమవారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుండి 45 లోపు ఉమ్మడి జిల్లా వారు అర్హులని,ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని 7032415062 సంప్రదించాలన్నారు.
News September 8, 2025
నేడు గ్రీవెన్స్ డే రద్దు: ఎస్పీ

నేడు (సోమవారం) నిర్వహించాల్సిన గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆయన అందుబాటులో ఉండని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని తెలిపారు.