News April 7, 2025

రుద్రంగి: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

image

 ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కణ్నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది. 

Similar News

News April 18, 2025

జగిత్యాల: రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల స్కీంకు దరఖాస్తులు

image

2025 -26 విద్యా సంవత్సరానికి రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల స్కీంకు జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. అన్ని వసతులు, మంచి ఉత్తీర్ణత కలిగి ఉన్న కళాశాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ నెల 30లోగా ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తులను మే 1లోగా సమర్పించాలన్నారు.

News April 18, 2025

కరీంగనర్: ఏప్రిల్ 30 వరకు LRS చెల్లిస్తే 25% రాయితీ

image

గురువారం హైదరాబాద్ నుంచి ‌రాష్ట్ర మున్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ LRSపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30 వరకు LRS చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రచారం కల్పించాలన్నారు. ఫీజు చెల్లిస్తే లేఔట్ల ‌భూక్రమబద్ధీకరణ మంజూరు పత్రాలను జారీ చేయాలని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని‌ ఆదేశించారు. ఏసీ ప్రపుల్ దేశాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News April 18, 2025

కేంద్ర మంత్రికి ఎంపీ అంబికా ప్రశంస 

image

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్-2025గా ఎంపికైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. తెలుగు వ్యక్తిగా ఆయనకు వచ్చిన ఈ అంతర్జాతీయ గుర్తింపు.. మన రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణమన్నారు. శ్రమ, సమర్ధత, విజన్ కలిగిన యువ నాయకుడు రామ్మోహన్ అని ఎంపీ ప్రశంసించారు.

error: Content is protected !!