News April 7, 2025
MHBD: ఏడేళ్ల చిన్నారిపై కిడ్నాప్‌కు యత్నం

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పిచ్చిరాం తండాలో ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చెయ్యడానికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సోదరుడు, మరో బాలుడితో చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు వచ్చి చిన్నారిని బలవంతంగా బైకుపై ఎక్కించుకొని వెళ్లారు. చిన్నారి కేకలు వేయడంతో వదిలిపెట్టి పారిపోయారు.
Similar News
News April 18, 2025
నారాయణపేట: ‘నా భర్త చనిపోయాడు.. నన్ను ఆదుకోండి మేడం’

మద్దూరు మండలంలో జరిగిన భూభారతి సభలో ఓమేశ్వరి అనే మహిళ తన సమస్యను కలెక్టర్‌కి వివరించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మహిళ మాట్లాడుతూ.. తన భర్త కాశప్ప చనిపోయి సంవత్సరం అవుతోందని, కానీ తనకి ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వం పథకం నుంచి లబ్ధి చేకూరలేదన్నారు. వితంతు పెన్షన్ కూడా రావడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తన గోడు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం సహాయం చేయాలని కలెక్టర్‌ని కోరారు.
News April 18, 2025
తిరుమలలో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను వ్యక్తిగతంగా ప్రశ్నించి, ఏర్పాట్లపై అభిప్రాయాలు సేకరించారు. శానిటేషన్, క్యూ లైన్లు, తాగునీరు వంటి సదుపాయాలపై ప్రత్యక్షంగా పరిశీలించారు. లడ్డూ, అన్నప్రసాదాలు నాణ్యతను పరిశీలించారు.
News April 18, 2025
జగిత్యాల: రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల స్కీంకు దరఖాస్తులు

2025 -26 విద్యా సంవత్సరానికి రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల స్కీంకు జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. అన్ని వసతులు, మంచి ఉత్తీర్ణత కలిగి ఉన్న కళాశాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ నెల 30లోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తులను మే 1లోగా సమర్పించాలన్నారు.