News March 26, 2024

హంద్రీనీవాను పరిశీలించిన చంద్రబాబు

image

రామకుప్పం వద్ద హంద్రీనీవా కాలువను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పానికి నీళ్లు రావడం గ్రాఫిక్స్‌లా ఉందన్నారు. ఉత్తుత్తి ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే కనిపించిన నీరు ఇప్పుడు కనబడటం లేదని విమర్శించారు. మరి ఇంత మోసమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం దగ్గర పడిందని హంద్రీనీవా నీళ్లు ఇచ్చినట్లు షో చేశారని మండిపడ్డారు.

Similar News

News January 9, 2025

తిరుపతిలో రేపు హర్యానా గవర్నర్ బండారు పర్యటన

image

తిరుపతిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం పర్యటిస్తారని సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉదయం 11. గంటలకు జరగనున్న ప్రవాసీ భారతీయ దివస్ (NRI) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. 

News January 9, 2025

రేపు తిరుపతికి చంద్రబాబు రాక

image

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం గురువారం తిరుపతికి రానున్నారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ఆయన పరామర్శిస్తారని సమాచారం.

News January 8, 2025

పెద్దిరెడ్డికి ఆయుధాలు ఇచ్చేయండి: హైకోర్టు

image

ఎన్నికల ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి నుంచి పోలీసులు లైసెన్స్‌డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. 2 వారాల్లోనే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయుధాలు అప్పగించాలని జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఆదేశించారు.