News April 7, 2025
ఒంటిమిట్టకు రాష్ట్ర మంత్రుల రాక

రాష్ట్ర మంత్రుల బృందం సోమవారం ఒంటిమిట్టకు వస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత, మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒంటిమిట్టలో కోదండ రామునికి పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తారని చెప్పారు.
Similar News
News April 8, 2025
అన్నమయ్య : డిప్యూటీ కలెక్టర్ మృతి.. ప్రమాదం జరిగింది ఇలా..!

పీలేరు హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న రమ (56) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె సోమవారం ఉదయం రాయచోటిలో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు కారులో వెళ్తుండగా సంబేపల్లిలోని ఎర్రగుంట్ల బస్టాండ్ సమీపంలో, గల్ఫ్‌కు వెళ్లేందుకు చెన్నై వెళ్తున్న కారు ఢీ కొట్టింది. రమ అక్కడికక్కడే చనిపోగా.. ఆమె డ్రైవర్ ముబారక్, అటెండర్ జీరూనాయక్, ఢీ కొట్టిన కారు డ్రైవర్ గాయపడ్డారు.
News April 8, 2025
కడప: రూ.50 పెంచడంతో రూ.3.కోట్ల భారం

కడప జిల్లాలోని పేద ప్రజలకు మరో షాక్ తగిలింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. జిల్లాలో 7.50 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రూ.853గా ఉన్న సిలిండర్ రూ.903కు చేరడంతో జిల్లాలోని వినియోగదారులపై అదనంగా రూ.3కోట్లకుపైగా భారం పడనుంది. దీనిపై మీ కామెంట్.
News April 8, 2025
కమలాపురం: సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన తులసి రెడ్డి

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో సబర్మతి నది ఒడ్డున ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సోమవారం రాత్రి పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏఐసీసీ సభ్యులు తులసిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ నివసించిన ఇల్లు చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అక్కడ ఆయన 12 సంవత్సరాలు నివసించారని తెలిపారు. ఇది మర్చిపోలేని ఘటన అని ఆయన అన్నారు.