News April 7, 2025
బాపట్లలో యాక్సిడెంట్.. తల్లి, కుమారుడు మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందడంతో బాపట్లలో విషాద ఛాయలు అలుము కున్నాయి.స్థానికుల వివరాల మేరకు..పట్టణంలోని జగనన్న కాలనీ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కొడుకు శివయ్య మృతిచెందగా, తల్లి చిట్టెమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 18, 2025
మాదాపూర్: మే 1 నుంచి సమ్మర్ ఆర్ట్ క్యాంప్

మాదాపూర్‌లోని శిల్పారామంలో ఏటా నిర్వహించే సమ్మర్ ఆర్ట్ క్యాంప్‌ను ఈ ఏడాది మే 1 నుంచి ప్రారంభం కానున్నట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా నిర్వహించే ఈ క్యాంపులో నామమాత్ర రుసుము, వయస్సుతో సంబంధం లేకుండా ఆసక్తి గలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 8886652030, 8886652004 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News April 18, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మరో పైలట్ ప్రాజెక్ట్

ఇందిరా గిరి సోలార్ జల వికాసం పథకానికి రూ.12,500 కోట్ల ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం విధి విధానాలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలన్నారు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చి.. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది.
News April 18, 2025
రూ.10 నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందంటే?

రెండు రంగులతో కనిపించే రూ.10 నాణేన్ని తయారు చేయడానికి ఆర్బీఐ రూ.5.54 ఖర్చు చేస్తుంది. కాయిన్ మధ్య భాగాన్ని కుప్రో నికెల్‌తో, బయటి సర్కిల్‌ను అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారు. అలాగే, నాణెం బయటి వృత్తం 4.45 గ్రాములు, మధ్య భాగం 3.26 గ్రాములతో మొత్తం 7.71గ్రా. బరువు ఉంటుంది. గతంలో కొన్ని రోజులు ఈ నాణేలు చెల్లవని ప్రచారం జరిగినా, అవి చట్టబద్ధమైనవని ఆర్బీఐ అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.