News April 7, 2025

MMTS రైళ్లలో మహిళల రక్షణకు వాట్సప్ గ్రూప్

image

MMTS రైళ్లలో మహిళల రక్షణకు RPF అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ రైలులో ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మహిళా కోచ్‌లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

Similar News

News July 9, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మేకప్ పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈనెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

News July 9, 2025

MBA కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలోని MBA కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-ఈవినింగ్) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు.

News July 9, 2025

ఓయూ బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 24లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.200 లేట్ ఫీతో ఈ నెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.