News April 7, 2025
వనపర్తి: తమకు పెళ్లి చేయాలంటూ PSకు ప్రేమ జంట

తమకు పెళ్లి చేయాలంటూ ఓ ప్రేమ జంట PSకు వచ్చిన ఘటన వనపర్తి జిల్లా పానగల్‌లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రేమద్దుల గ్రామానికి చెందిన నందిని(22), మహేందర్(29) రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అమ్మాయి PSలో ఫిర్యాదు చేసింది. ఇద్దరు మేజర్లు కావడంతో కుటుంబీకులతో పోలీసులు మాట్లాడి ఒప్పించారు. త్వరలో వారి పెళ్లి చేస్తామన్నారు.
Similar News
News March 2, 2026
ఉగాది నాటికి 16,702 ఇళ్ల పూర్తి లక్ష్యం సాధించాలి: జేసీ

అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఏ బిల్లుల అప్లోడ్, స్వామిత్వం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు.
News March 2, 2026
కామారెడ్డి: ప్రజాస్వామ్య విలువలకు నిలువుటద్దం దుద్దిల్ల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, దివంగత నాయకుడు దుద్దిల్ల శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మహోన్నత నేత అని కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి కొనియాడారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి వేడుకలను నిర్వహించారు. అదనపు ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
News March 2, 2026
వనపర్తి: రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

వనపర్తి మండలం చిట్యాల మార్కెట్ యార్డు ముందు రాత్రి 8 గంటలకు పల్సర్ బైక్ కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై ఉన్న బిజినేపల్లి మండలం మహదేవుని పేటకు చెందిన హేమంత్, శ్రీకాంత్, విజయ్ గాయపడ్డారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించగా.. ఒకరికి వనపర్తి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని వనపర్తి రూరల్ SI రిషికేష్ తెలిపారు. కుటుంబ సభ్యులు వారి వెంటే ఉన్నారని ఫిర్యాదు అందలేదని చెప్పారు.


