News April 7, 2025
కాలువలో స్నానానికి దిగి యువకుడు గల్లంతు

రావులపాలెం మండలం గోపాలపురం బ్యాంక్ కాలవలో ఈతకోట నెక్కంటి కాలనీకి చెందిన షేక్ ఖాదర్ (21) ఆదివారం గల్లంతయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి మధ్యాహ్నం గోపాలపురం ఆరుమామిళ్ల రేవు వద్దకు స్నానానికి వెళ్లాడు. ఈత కొడుతూ ఖాదర్ గల్లంతయ్యాడు. ఇద్దరు స్నేహితులు స్థానికులకు విషయం తెలిపడం తో పోలీస్, ఫైర్ సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు ఆచూకీ లభించలేదు.
Similar News
News March 3, 2026
ఇండియాను విడిచి వెళ్తా: ఇరానియన్ నటి

భద్రతా కారణాల వల్ల తాను ఇండియాను విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు ఇరానియన్ మోడల్, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ మందన కరిమి వెల్లడించారు. దేశం విడిచి వెళ్లిన తర్వాతే పూర్తి వివరాలు బయటపెడతానన్నారు. ‘ఇరాన్‌లో నియంతృత్వంపై మాట్లాడటం. వాస్తవాలు చెప్పడం వల్ల చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. నాకు ప్రభుత్వం/మీడియా నుంచి సపోర్ట్ లేదు. ఇక్కడ ఇంట్లో ఉన్నట్లు అనిపించడం లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
News March 3, 2026
ఒకప్పుడు బంగారాన్ని ఇలా కొలిచేవారు!

పూర్వం బంగారాన్ని వీసం, తులం, కాసు, సవర వంటి విధానాల్లో కొలిచేవారు. అప్పట్లో వీసం (19 మి.గ్రా) కనిష్ఠ కొలతగా ఉండేది. 5 వీసాలు = ఒక గురివింద గింజ (95mg). 2 గురివింద గింజలు= 1 కాణి (185mg). 2 కాణిలు= 1 అర్ధణా (365mg). 2 అర్ధణాలు =1 అణా(730mg). 2 అణాలు= 1 బేడ(1.46G). 2 బేడలు= 1 పావు(2.9G). 4 బేడాలు = అరతులం(5.84గ్రా). 2 అరతులాలు= తులం (11.66గ్రాములు). అలాగే సవర/ కాసు అంటే 8గ్రాముల బంగారం అని అర్థం.
News March 3, 2026
గద్వాల జిల్లాలో కనువిందు చేసిన ‘బ్లడ్ మూన్’

గద్వాల జిల్లాలో మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమైన ఈ గ్రహణం, సాయంత్రం 6:47 గంటలకు సంపూర్ణ స్థితికి చేరుకుంది. గ్రహణ సమయంలో చంద్రుడు ఒక్కసారిగా ఎరుపు రంగులోకి మారి ‘బ్లడ్ మూన్’గా దర్శనమిచ్చింది. అనంతరం క్రమంగా తన సహజ సిద్ధమైన తెలుపు రంగులోకి వచ్చాడు. మరికొన్ని చోట్ల దీని ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. ఏది ఏమైనా చంద్రగ్రహాన్ని అందరూ వీక్షించారు.


