News April 7, 2025
CTలో చోటు దక్కకపోవడం నిరాశపరిచింది: సిరాజ్

ఛాంపియన్స్ ట్రోఫీలో తనకు చోటు దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయానని GT పేసర్ మహ్మద్ సిరాజ్ చెప్పారు. ‘టీమ్ ఇండియా తరఫున కంటిన్యూగా ఆడుతుండగా ఒక్కసారిగా డ్రాప్ చేయడంపై ఎన్నో డౌట్స్ వస్తాయి. అందుకే నా బలహీనతలపై దృష్టి పెట్టాను. ఫిట్‌నెస్, ఆటను మెరుగుపర్చుకున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ ముందు రాణించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. నిన్న 4 వికెట్లతో సిరాజ్ SRHను దెబ్బతీశారు.
Similar News
News April 18, 2025
రూ.10 నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందంటే?

రెండు రంగులతో కనిపించే రూ.10 నాణేన్ని తయారు చేయడానికి ఆర్బీఐ రూ.5.54 ఖర్చు చేస్తుంది. కాయిన్ మధ్య భాగాన్ని కుప్రో నికెల్‌తో, బయటి సర్కిల్‌ను అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారు. అలాగే, నాణెం బయటి వృత్తం 4.45 గ్రాములు, మధ్య భాగం 3.26 గ్రాములతో మొత్తం 7.71గ్రా. బరువు ఉంటుంది. గతంలో కొన్ని రోజులు ఈ నాణేలు చెల్లవని ప్రచారం జరిగినా, అవి చట్టబద్ధమైనవని ఆర్బీఐ అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.
News April 18, 2025
తరచూ జలుబు వేధిస్తోందా?

సీజన్లతో సంబంధం లేకుండా కొందరిని తరచూ జలుబు వేధిస్తుంటుంది. దీనికి శరీరంలో అయోడిన్ లోపం కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో మాటిమాటికీ వచ్చే ఆవలింతలకు కారణం ఐరన్ లోపం అని అంటున్నారు. అలాగే, కాళ్లు, చేతుల కండరాల్లో రెగ్యులర్‌గా నొప్పులు వస్తుంటే శరీరంలో మెగ్నీషియం తక్కువైందని గుర్తించాలంటున్నారు. వెన్ను, కాళ్ల నొప్పులొస్తే విటమిన్-D టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News April 18, 2025
? ప్లేస్‌లో ఉండాల్సిన నంబర్ ఏంటి?

పై ఫొటోలో ఉన్న రీజనింగ్ క్వశ్చన్ చూశారు కదా! చిన్న లాజిక్ ఉపయోగిస్తే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ? ప్లేస్‌లో ఉండాల్సిన నంబర్ ఏంటో కనుగొంటే COMMENT చేయండి.