News April 7, 2025

అనకాపల్లి జిల్లాలో యువకుడి హత్య

image

రావికమతం మండలం గర్ణికం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మేడివాడకి చెందిన కొలిపాక పవన్ కుమార్(22) హత్యకు గురై మరణించాడు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మ, అనకాపల్లికి చెందిన క్లూస్ టీం ఘటనా స్థలం చేరుకొని హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఫోన్ కొనేందుకు ఆదివారం పవన్ రావికమతం వచ్చినట్లు తండ్రి త్రిమూర్తులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 18, 2025

రూ.10 నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందంటే?

image

రెండు రంగులతో కనిపించే రూ.10 నాణేన్ని తయారు చేయడానికి ఆర్బీఐ రూ.5.54 ఖర్చు చేస్తుంది. కాయిన్ మధ్య భాగాన్ని కుప్రో నికెల్‌తో, బయటి సర్కిల్‌ను అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారు. అలాగే, నాణెం బయటి వృత్తం 4.45 గ్రాములు, మధ్య భాగం 3.26 గ్రాములతో మొత్తం 7.71గ్రా. బరువు ఉంటుంది. గతంలో కొన్ని రోజులు ఈ నాణేలు చెల్లవని ప్రచారం జరిగినా, అవి చట్టబద్ధమైనవని ఆర్బీఐ అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.

News April 18, 2025

NZB: జిల్లా ప్రజల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నా: జడ్జి

image

జిల్లా ప్రజలు, న్యాయవాదుల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నానని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి గురువారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తుల ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాలానుగుణంగా న్యాయ సేవలు అందించడమేనన్నారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించే వరకు సమష్టిగా శ్రమించామని గుర్తు చేశారు.

News April 18, 2025

నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి: మంత్రి దామోదర

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీల సంఖ్యను మరింత పెంచాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సరైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

error: Content is protected !!