News March 26, 2024
‘లాటరీ పద్ధతి ద్వారా సేవా ప్రదేశాల కేటాయింపు’

ఉగాది మహోత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకుంటామని ఈఓ పెద్దిరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సేవకులు మార్చి 29వ తేదీ నుంచి ఏప్రియల్ పదో తేదీ వరకు సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద సేవకులకు ప్రదేశాల కేటాయింపులో పారదర్శకత కోసం గత ఏడాది లాగే ఈ ఏడాది లాటరీ పద్దతిలో సేవా ప్రదేశాలను కేటాయిస్తామన్నారు.
Similar News
News September 28, 2025
తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం ప్రతీ శనివారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేసి, వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్, ఓవర్‌లోడ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి వాటిపై ముఖ్య సూచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
News September 28, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. వాగులు, వంకల వద్ద రాకపోకలు నిలిపివేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ తీగలు, నీటి ప్రవాహం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్ (08518-277305) పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు.
News September 27, 2025
ఆపదలో ఉంటే 112కు కాల్ చేయండి: కర్నూలు ఎస్పీ

ఆపదలు, అత్యవసర పరిస్థితులు, సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఫోన్ చేసిన వెంటనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి బ్లూ కోల్ట్స్, రక్షక్, పోలీసులు చేరుకుంటారన్నారు. డయల్ 112 హెల్ప్ లైన్ నంబర్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానమై అందుబాటులో ఉంటుందన్నారు.