News April 7, 2025
NLR: ఇంటర్ అమ్మాయితో అసభ్య ప్రవర్తన

పాఠాలు చెబుతానంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నెల్లూరులో జరిగింది. నగరానికి చెందిన యువతి దర్గామిట్టలోని ఓ బిల్డింగ్‌లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటోంది. అదే భవనంలోని ఇన్సురెన్స్ ఆఫీస్‌లో శ్రీనివాసులు రెడ్డి పనిచేస్తున్నాడు. కెమెస్ట్రీలో డౌట్స్ క్లియర్ చేస్తానంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది.
Similar News
News December 29, 2025
నెల్లూరు: గ్రీటింగ్ కార్డులు మాయం..!

స్మార్ట్‌ఫోన్ల యుగంలో భావాలను వ్యక్తపరిచే పద్ధతులే మారిపోయాయి. ఒకప్పుడు పండగలు, పర్వదినాలు వచ్చాయంటే చేతిలో గ్రీటింగ్ కార్డు తప్పనిసరిగా ఉండేది. కాలక్రమంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు శుభాకాంక్షల మార్పిడిని పూర్తిగా డిజిటల్‌గా మార్చేశాయి. ఒక్క క్లిక్‌తోనే సందేశం చేరుతుండటంతో గ్రీటింగ్ కార్డుల అవసరం తగ్గింది.
News December 29, 2025
సైదాపురం: బాలుడిని ఢీకొట్టిన టిప్పర్

సైదాపురం ST కాలనీ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు సమీపంలోని క్రషర్ నుంచి కంకర్ లోడుతో గూడూరు వైపు ఓ టిప్పర్ బయల్దేరింది. మార్గమధ్యంలో టిప్పర్ అదుపు తప్పి దక్షేశ్(5)పైకి దూసుకెళ్లింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 29, 2025
నెల్లూరులోకి గూడూరు.. ఆ రెండు తిరుపతిలోనే!

గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నెల్లూరులో కలపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. CM చంద్రబాబుతో ఆదివారం జరిగిన చర్చల్లో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చిందంట. గూడూరు, కోట, చిల్లకూరు మండలాలనే నెల్లూరులో కలిపి.. వాకాడు, చిట్టమూరును తిరుపతి జిల్లాలో కొనసాగిస్తారని సమాచారం. నేటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత అధికార ప్రకటన చేయనున్నారు.


