News April 7, 2025
మడపాం: వంశధార నదిలో జారిపడి మత్స్యకారుడు మృతి

నరసన్నపేట మండలం మడపాం వద్ద వంశధార నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మత్స్యకారుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం చేపల వేట కోసం వెళ్లిన వాడ అంజలి అప్పన్న నదిలో వల విసరగా పెద్ద బండరాయి వలకు తగిలింది. చేపలు పడి ఉంటాయని గట్టిగా లాగడంతో జారిపడి మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 8, 2025
శ్రీకాకుళం: ‘ఆధార్ సేవలను వినియోగించుకోండి’

జిల్లా ప్రజలందరికీ ఆధార్ సేవలు సులభంగా అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలోని 732 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి 5 సచివాలయాలకు ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 146 ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
News April 8, 2025
SKLM: ‘అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు’

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను చట్ట పరిధిలో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులకు ఎండార్స్ చేసి పరిష్కరించాలని చెప్పారు.
News April 7, 2025
లావేరు: ‘బెట్టింగ్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలి’

లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మీసాల భానోజీ రావు సోమవారం జరిగిన కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో బెట్టింగ్ యాప్‌లపై ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌ల మాఫియాపై నిఘా ఉంచాలని, వాటిని అరికట్టకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.