News April 7, 2025

తంగళ్ళపల్లి: బీఆర్ఎస్ యువ నాయకుడి మృతి

image

తంగళ్ళపల్లి మండలం కస్బేకట్కూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు జూపల్లి సందీప్ రావు హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. సందీప్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పార్టీ నాయకులు పేర్కొన్నారు. మృతి చెందిన సందీప్ రావుకు అఖిలపక్ష నాయకులు తమ సంతాపాన్ని తెలిపారు.

Similar News

News February 25, 2026

ఎంపీ కడియం కావ్యకు అరుదైన గౌరవం

image

ఎంపీ డాక్టర్ కడియం కావ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఏర్పాటు చేసిన ఇండియా- సౌదీఅరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌ సభ్యురాలిగా కావ్యను లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ (కాన్ఫరెన్స్ అండ్ ప్రొటోకాల్ విభాగం) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భారత్-సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌ ఏర్పాటు చేశారు.

News February 25, 2026

ఊరిలో సగం మంది కవలలే..!

image

కేరళలోని కొడిన్హి గ్రామం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వెయ్యి జననాల్లో కేవలం నలుగురు కవలలు పుడితే ఇక్కడ ఆ సంఖ్య ఏకంగా 45కి పైగా ఉంది. సుమారు 2,000 కుటుంబాలున్న ఆ ఊరిలో 400కు పైగా కవల జంటలు నివసిస్తున్నాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. ఇలాంటి వింతైన విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’ ఎపిసోడ్‌లో..

News February 25, 2026

T20 WC: కివీస్‌తో మ్యాచ్.. లంక బౌలింగ్

image

న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న కీలక మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-8లో ఇప్పటికే ఇంగ్లండ్ చేతిలో ఓడిన లంక ఈ మ్యాచులో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడితే ఇంటిబాట పడుతుంది. అటు పాక్‌తో మ్యాచు వర్షం కారణంగా రద్దవడంతో కివీస్‌కూ ఈ మ్యాచులో గెలవడం తప్పనిసరిగా మారింది. టీమ్స్ వివరాలు పైన ఇమేజ్‌లో చూడొచ్చు. మరి ఇవాళ ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు? COMMENT