News April 7, 2025

వరంగల్: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

image

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.

Similar News

News November 8, 2025

కృష్ణా: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

image

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి తన నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ. 14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులు కృష్ణా జిల్లా పెడనకి చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.

News November 8, 2025

రాత్రి బెడ్‌షీట్ కప్పి ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా?

image

ఈమధ్య యువత పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్‌లో రీల్స్ ఫ్లిప్ చేస్తూనే జీవితం గడుపుతోంది. చీకట్లో కళ్లకు దగ్గరగా పెట్టుకుని ఫోన్ చూస్తే నరాలు, మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా లైట్స్ ఆఫ్ చేశాక, బెడ్ షీట్ కప్పుకుని స్క్రీన్‌కు అతుక్కుపోయారంటే మన కళ్లపై బ్లూ లైట్ నేరుగా పడుతుంది. దీంతో నిద్రలేమి, కంటి చూపు సమస్యలు వస్తాయి. ఫోన్ వాడండి. వ్యసనంగా మార్చుకోకండి.
Share It

News November 8, 2025

ఇడుపులపాడు చెరువులో 16 ఏళ్ల యువకుడు గల్లంతు

image

ఇంకొల్లు మండలం ఇడుపులపాడులోని చెరువులో 16 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన శనివారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన అతను బయటకు రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడినప్పటికీ లైట్లు వేసి గాలిస్తున్నారు.