News April 7, 2025

సమ్మర్ ఎఫెక్ట్.. ధరలు రెట్టింపు

image

AP: ఎండలు పెరుగుతుండటంతో నిమ్మకాయ ధరలు రెట్టింపయ్యాయి. గత నెలలో క్వింటా రూ.6 వేల వరకూ ఉండగా ప్రస్తుతం రూ.12వేలకు చేరింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల దిగుబడి వస్తుండగా వేసవిలోనే 4 లక్షల టన్నులు ఉంది. మరోవైపు మార్కెట్‌లో కాయ సైజును బట్టి ఒక్కోటి రూ.5-10 వరకు అమ్ముతున్నారు.

Similar News

News April 16, 2025

KKR ఓటమికి అతడే కారణమంటూ ఫ్యాన్స్ ఫైర్

image

పంజాబ్‌తో మ్యాచ్‌లో KKR ఓటమికి ఆ జట్టు కెప్టెన్ రహానేనే కారణమని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. చాహల్ బౌలింగ్‌లో స్వీప్ ఆడబోయిన అతను LBWగా వెనుదిరిగారు. తర్వాత రిప్లేలో బాల్ వికెట్లను మిస్ అయినట్లు కనిపించింది. రివ్యూ తీసుకొని ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఆ జట్టు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని, కెప్టెన్‌గా మంచి నాక్ ఆడాల్సిందని మ్యాచ్ అనంతరం రహానే తెలిపారు.

News April 16, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 16, బుధవారం)

image

ఫజర్: తెల్లవారుజామున 4.45 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.00 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు అసర్: సాయంత్రం 4.42 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.32 గంటలకు ఇష: రాత్రి 7.47 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 16, 2025

శుభ ముహూర్తం (16-04-2025)(బుధవారం)

image

తిథి: బహుళ తదియ ఉ.10.24 వరకు తదుపరి చవితి.. నక్షత్రం: అనురాధ తె.3.09వరకు తదుపరి జ్యేష్ట.. శుభ సమయం: ఉ.9.48 నుంచి 10.12 వరకు తిరిగి సా.7.12 నుంచి 7.42 వరకు.. రాహుకాలం: ప.12.00-1.30 వరకు.. యమగండం: ఉ.7.30-9.00 వరకు దుర్ముహూర్తం: ఉ.11.36-12.24 వరకు.. వర్జ్యం: శే.తె.6.57 వరకు పున: వర్జ్యం లేదు అమృత ఘడియలు: మ.3.42 నుంచి 5.26 వరకు

error: Content is protected !!