News April 7, 2025

రుద్రంగి: ఫుడ్ పాయిజన్‌తో బాలుడి మృతి

image

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు <<16016221>>ఫుడ్<<>> పాయిజన్‌తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి తల్లి పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిని వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News April 18, 2025

కరీంనగర్: ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ 100% పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టర్‌లో ఇందిరమ్మఇండ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసిన 15 గ్రామాలలో 2027 మందికి ఇల్లు మంజూరు చేసామని పేర్కొన్నారు. 730 ఇండ్లకు పూర్తయిందని,114 బేస్మెంట్ లెవల్‌కు చేరాయని తెలిపారు. రెండోదఫా ఇండ్లను గ్రామాలు, మున్సిపల్‌వార్డుల వారిగా మంజూరు చేసేందుకు అలాట్మెంట్ జాబితా తయారుచేయాలని అన్నారు.

News April 18, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన∆} వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం సంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 18, 2025

VJA: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని ఇంద్రనాయక్ నగర్‌లో గురువారం సాయంత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ఇంటిపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్, సింగ్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

error: Content is protected !!