News April 7, 2025
తెలంగాణ ప్రభుత్వంపై బాలీవుడ్ నటి ఫైర్

HYD కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి దియా మిర్జా తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ‘కంచ గచ్చిబౌలి పరిస్థితి గురించి తెలంగాణ సీఎం నిన్న ఒక ట్వీట్ చేశారు. నేను నకిలీ AI ఫొటోలు/ వీడియోలు ఉపయోగించానని చెప్పారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. నేను పోస్ట్ చేసినవి ఒరిజినల్ వీడియోలు. ఇటువంటి వాదనలు చేసే ముందు మీడియా, ప్రభుత్వం వాస్తవాలను ధ్రువీకరించుకోవాలి’ అని ఆమె Xలో రాసుకొచ్చారు.
Similar News
News April 18, 2025
జీవిత ఖైదీలకు సర్కార్ గుడ్‌న్యూస్

AP: రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న జీవితఖైదీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అర్హులైన ఖైదీల పేర్లు సిద్ధం చేయాలంటూ జైళ్ల శాఖ DG అంజనీ కుమార్‌ను ఆదేశించింది. ఎంపిక చేసిన ఖైదీలు రూ.50వేల ష్యూరిటీతోపాటు శిక్షాకాలం పూర్తయ్యే వరకూ స్థానిక PSలో 3నెలలకోసారి సంతకం చేయాలి. మళ్లీ నేరానికి పాల్పడితే క్షమాభిక్ష రద్దవుతుంది.
News April 18, 2025
IPL: SRH చెత్త రికార్డ్

MIతో నిన్నటి మ్యాచ్‌లో ఓటమితో SRH బయటి పిచ్‌ల మీద పరాజయాల పరంపర కొనసాగించింది. ఈ సీజన్‌లో ఉప్పల్‌లో కాకుండా SRH వైజాగ్, కోల్‌కతా, ముంబైలో మ్యాచ్‌లు ఆడి, వాటన్నింటిలోనూ ఓడింది. మరోవైపు, మిగతా అన్ని జట్లు బయట ఆడిన మ్యాచ్‌లు గెలిచాయి. ఉప్పల్ వంటి బ్యాటింగ్ పిచ్ అయితే SRH భారీ స్కోర్ చేస్తుండటం గమనించిన మిగతా జట్లు స్లో పిచ్‌లను సిద్ధం చేయిస్తున్నాయి. ఆపై తక్కువ రన్స్‌కే కట్టడి చేసి నెగ్గుతున్నాయి.
News April 18, 2025
నీళ్లు తరలించకుండా చూడండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

TG: కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. జులై వరకూ తాగునీటి అవసరాల కోసం రాష్ట్రానికి 16.20TMCల నీరు కావాలని బోర్డుకు తెలిపింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల కింద రాష్ట్రానికి తాగు, సాగు నీటి అవసరాలకు 29.79 TMCల నీరు రావాల్సి ఉందంది. ఇప్పటికే కేటాయించిన వాటా కంటే అదనంగా AP వినియోగించుకుందని, ఇకపై నీటిని తరలించకుండా చూడాలని నీటి పారుదల ENC కృష్ణా బోర్డును కోరారు.