News April 7, 2025

అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

image

అశ్వారావుపేట శివారులో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. అశ్వారావుపేటకు చెందిన జీసీసీ రేషన్ డీలర్ భూక్యా కృష్ణ మండలం కావడిగుండ్లలో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో దొంతికుంట సమీపంలో వాగొడ్డుగూడెం వైపు వెళ్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో డీలర్ కృష్ణకు కుడికాలు విరగ్గా వాగొడ్డుగూడెంకు చెందిన నాగరాజు, గంగారంకి చెందిన రాజుకు గాయాలయ్యాయి.

Similar News

News April 18, 2025

కామారెడ్డి జిల్లాలో రాత్రి రోడ్డు ప్రమాదం

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని జాతీయ రహదారి- 44 పై ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది.

News April 18, 2025

విశాఖ: దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ప్రోగ్రాంకు పోలీసుల పర్మిషన్

image

విశాఖలో ఈ నెల 19న నిర్వహించనున్న దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ ప్రోగ్రాంకు పోలీసులు గతంలో పర్మిషన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మ్యూజికల్ ఈవెంట్స్ ప్రతినిధులు మరొకసారి పోలీసులకు అభ్యర్థన చేసుకున్నారు. వారి అభ్యర్థన మేరకు పోలీసులు పూర్తిగా సెక్యూరిటీని పరిశీలించి, భద్రతా చర్యలన్నీ ఏర్పాటు చేసినట్లు గుర్తించి మ్యూజికల్ ప్రోగ్రాంకు అనుమతులు ఇస్తున్నట్లు గురువారం ప్రకటన విడుదల చేశారు.

News April 18, 2025

విశాఖ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్

image

విశాఖ విమానాశ్రయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమానంలోని ఇద్దరు ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు, నిషేధిత ఈ- సిగరెట్లను కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.66,90,609 ఉంటుందని అధికారులు తెలిపారు. ఐఫోన్లు, ఈ- సిగరెట్లను నగరానికి అక్రమంగా తీసుకొస్తున్నట్లు అందిన సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి వారిని పట్టుకున్నారు.

error: Content is protected !!