News March 26, 2024
డికాక్, నోకియాకు సౌతాఫ్రికా బిగ్ షాక్

సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్లు క్వింటన్ డికాక్, అన్రిచ్ నోకియాకు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాక్ ఇచ్చింది. 2024-25 సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వీరిద్దరినీ తప్పించింది. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు లిస్టులో వీరిద్దరి పేర్లను చేర్చలేదు. అలాగే బర్గర్, జార్జి తొలిసారి కాంట్రాక్టు దక్కించుకున్నారు. కాగా ఐపీఎల్‌లో LSGకి డికాక్, DCకి నోకియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News March 15, 2026
సన్‌రైజర్స్‌కు పాక్ ప్లేయర్ దూరం?

The Hundred టోర్నీ కోసం అబ్రార్(పాక్)ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ లీగ్ జులై 21-AUG 16 వరకు కొనసాగనుండగా అదే సమయంలో పాక్ టీమ్ 2 టెస్టుల సిరీస్ కోసం విండీస్‌లో పర్యటించనుంది. అందువల్ల అబ్రార్‌కు పాక్ NOC ఇవ్వకపోవచ్చని, టోర్నీలో ఆడటం అనుమానమేనని సమాచారం. కాగా అతను టోర్నీకి అందుబాటులో ఉంటాడనే కొనుగోలు చేశామని SRH హెడ్ కోచ్ వెటోరీ చెప్పిన విషయం <<19370720>>తెలిసిందే.<<>>
News March 15, 2026
అటామిక్ క్లాక్స్ చెడిపోతే ఏం జరుగుతుంది?

నేవిగేషన్ వ్యవస్థలో అటామిక్ క్లాక్స్(పరమాణు గడియారాలు) కీలకం. భూమిపై ఉన్న మనిషి/ప్రదేశం/ వస్తువు స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ఇవే ఆధారం. ఇవి 15 బిలియన్ ఏళ్లలో ఒక్క సెకను కూడా తప్పు చూపవు. ప్రస్తుతం నావిక్ వ్యవస్థలోని <<19386461>>ఈ క్లాక్<<>> చెడిపోయింది. దీనివల్ల ఏదైనా వస్తువు అసలు స్థానం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చూపుతాయి. నావిక్‌తో అనుసంధానమైన 8,700 రైళ్లకు అంతరాయం ఏర్పడవచ్చు.
News March 15, 2026
ఇలా అయితే SRHకు ఇబ్బందులు తప్పవు: పుజారా

SRHలో అభిషేక్, హెడ్, క్లాసెన్ లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నప్పటికీ అనేక లోపాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ పుజారా తెలిపారు. ‘ఆ ముగ్గురు ఔటవగానే జట్టును ముందుకు తీసుకెళ్లే ప్లేయర్ కనపడటం లేదు. దీన్ని ప్రత్యర్థి జట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. అలాగే SRH హోంగ్రౌండులో మినహా మిగతా మైదానాల్లో ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ అంశాలపై మేనేజ్‌మెంట్ దృష్టిసారించకపోతే ఇబ్బందులు తప్పవు’ అని పేర్కొన్నారు.


