News April 7, 2025
రుద్రంగి: ఫుడ్ పాయిజన్‌తో బాలుడి మృతి

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు ఫుడ్ పాయిజన్‌తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి <<16017744>>తల్లి<<>> పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిన్నాక వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదంలో 25కు పెరిగిన మృతుల సంఖ్య

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో <<18183371>>మృతుల సంఖ్య<<>> భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 25 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులేనని సమాచారం. మరోవైపు ఘటనాస్థలం వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
News November 3, 2025
ఎయిమ్స్ రాయ్‌బరేలిలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎయిమ్స్ రాయ్‌బరేలి 16 జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్, BDS అర్హతతో పాటు ఇంటర్న్‌షిప్ చేసినవారు ఈనెల 10న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ట వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100 జీతం అందుతుంది. వెబ్‌సైట్: https://aiimsrbl.edu.in/
News November 3, 2025
ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు ఏరియల్ సర్వే

నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ భద్రత, పనుల పూర్తి కోసం ఏరియల్ ఎలెక్ట్రోమాగ్నెటిక్ సర్వే సోమవారం ప్రారంభం కానుంది. సీఎం, మంత్రి ఉత్తమ్ సమక్షంలో ఎన్‌జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే మొదలు పెడతారు. 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా సేకరణ లక్ష్యంగా 200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్ ఫ్లైయింగ్ షెడ్యూల్ చేశారు.


