News March 26, 2024

రాజంపేట: వైసీపీలో చేరిన గంటా నరహరి

image

విజయవాడ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో జనసేన నాయకుడు గంటా నరహరి వైసీపీలో చేరారు. వైసీపీ గెలుపులో తాను కూడా భాగస్వామిని అవుతానని గంటా నరహరి పేర్కొన్నారు. ఇటీవలే ఈయన టీడీపీ నుంచి జనసేనలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News March 8, 2026

కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో జోరుగా చూచిరాత?

image

కడప జిల్లాలో 32 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. 6,503 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులతో ఇన్విజిలేటర్లు చూచిరాత రాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు స్టడీ సెంటర్ల నిర్వాహకులు సంబంధిత అధికారులకు, ఇన్విజిలేటర్లకు, బందోబస్తు పోలీసులకు పెద్ద మొత్తంలో మామూళ్లు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకుంటామని DEO తెలిపారు.

News March 7, 2026

కడప: ‘10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి’

image

కడప జిల్లాలో 10th పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జేసీ నిధిమీనా పరీక్షల నిర్వాహక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవన్‌లో పది పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 169 సెంటర్లలో 28,158 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్జేడీ శామ్యూల్, ఏసీ , డీఈఓ శంషుద్దీన్ హాజరయ్యారు.

News March 7, 2026

కమలాపురం వద్ద టిప్పర్- బైక్ ఢీ.. ఒకరు మృతి

image

కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కమలాపురం మండలం రామచంద్రపురం పరిధిలో టిప్పర్ స్కూటర్‌ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి జంగంపల్లికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.