News April 7, 2025

IITHYDకు INE హోదా.. 100% IT మినహాయింపు!

image

IIT హైదరాబాద్‌కు (IITH) కు ఇనిస్టిట్యూషనల్ ఆఫ్ నేషనల్ ఏమినాన్స్ (INE)’ హోదా లభించినట్లు డైరెక్టర్ ప్రొ.మూర్తి ప్రకటించారు. ఈ హోదాతో ఇప్పుడు IITHకి ఇచ్చే విరాళాలపై 100% ఆదాయపు పన్ను మినహాయింపు వర్తించనుందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రతిష్ఠాత్మక సంస్థలకు 50% మినహాయింపే ఉన్నా, తమకు 100% మినహాయింపు లభించడాన్ని గర్వకారణంగా అభివర్ణించారు.

Similar News

News January 5, 2026

ప్రీ టర్మ్ బర్త్‌ను నివారించాలంటే?

image

డెలివరీ డేట్ కంటే చాలాముందుగా డెలివరీ కావడాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. దీనివల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతి నెలా రెగ్యులర్ చెకప్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. మూత్రనాళ, దంత ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీలో పొగ, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పొత్తికడుపులో నొప్పి, రక్తస్రావం, ఉమ్మనీరు లీక్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

News January 5, 2026

జగిత్యాల: సీసీ కెమెరాల పని తీరును పరిశీలించిన కలెక్టర్

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతినెల నిర్వహించే ఈవీఎం గోదాము తనిఖీల్లో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా దారూర్ క్యాంప్‌లోని ఈవీఎం గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక అంశాలను ఆయన పరిశీలించారు. గోదాములో పటిష్టమైన భద్రత ఉండాలని, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

News January 5, 2026

10 నిమిషాల్లోనే సమస్యకు వరంగల్ కలెక్టర్ చెక్

image

ప్రజావాణిలో 10 సంవత్సరాలు పూర్తికాని సమస్యను పది నిమిషాల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిష్కరించారు. దరఖాస్తుదారుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి తన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మ్యుటేషన్ పెండింగ్ సమస్యపై తీవ్ర ఆవేశంతో వచ్చారు. సమస్య పరిష్కారం కావడంతో ప్రశాంతంగా వెళ్లారు. సమస్య ఏదైనా ప్రశాంతంగా పరిష్కారం అవుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.