News April 7, 2025

మెదక్: ప్రేమ వివాహం వద్దనందుకు యువతి ఆత్మహత్య

image

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాలు.. కామారెడ్డి జిల్లా భగీరథపల్లికి చెందిన వరలక్ష్మి(18) కొద్దిరోజులుగా చేగుంట(M) బోనాలలోని సోదరితో ఉంటుంది. అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వరలక్ష్మి ప్రేమలో పడింది. ఈ విషయంలో వరుస కాదని తల్లిదండ్రులు మందలించడంతో 4న విషం తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Similar News

News November 10, 2025

ఏయూలో పీజీ కోర్సుల వివరాలు ఇవే

image

➤ <<18250753>>పీజీ డిప్లొమా<<>> విభాగం: యోగా, ఫంక్షనల్ హిందీ ట్రాన్స్లేషన్, కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ కోర్సులను, డిప్లొమా విభాగంలో నటన, దర్శకత్వం, లలిత సంగీతం, నృత్యం, కర్ణాటక సంగీతం, తాళ వాయిద్యాలు.
➤ 6 నెలలకాల వ్యవధి: యోగా, విదేశీ కోర్సులలో ఫ్రెంచ్, జర్మన్, సాఫ్ట్ స్కిల్స్, ఫొటోగ్రఫీ, స్పానిష్ కోర్సులను అందిస్తున్నారు.

News November 10, 2025

అవినీతికి పాల్పడితే చర్యలు: కలెక్టర్

image

వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ జేడీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, అర్హులకు వాటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎవరన్నా అవినీతికి పాల్పడితే చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

News November 10, 2025

మిర్యాలగూడలో అమానుషం.. కుక్క నోట్లో మృత శిశువు లభ్యం

image

మిర్యాలగూడలో అమానుషం చోటుచేసుకుంది. సబ్ జైల్ రోడ్డులో కుక్క నోట్లో కరచుకున్న నెలలు నిండని మృత శిశువు లభ్యమైంది. పోలీసులకు సమాచారం అందించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆడశిశువు కావడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.